Nagarjuna: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అన్నీ రకాలుగా పక్కా బిజినెస్ మేన్ అంటే అందరూ చెప్పే పేరు కింగ్ నాగార్జున అని. అన్నపూర్ణ నిర్మాణ సంస్థలో నాగార్జున నిర్మిస్తున్న సినిమాలతో ఎంతో మంది కొత్తవారికి అవకాశాలిస్తూ వస్తున్నారు. వీరిలో అందరూ ఉన్నారు. దర్శకులు..ఇతర టెక్నీషియన్స్ కూడా నాగ్ నిర్మాణ సంస్థ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ డైరెక్టర్స్‌గా టెక్నీషియన్స్‌గా మారిన వారున్నారు. ఇక అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత త్వరగా ఎవరూ కొత్తవారికి అవకాశం ఇవ్వడం లేదు.
కానీ, నాగార్జున అందుకు భిన్నంగా కొత్త దర్శకులకు అవకాశాలివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాగ్ నటించిన సినిమా కొత్త దర్శకుడు చేసినా అది ఫ్లాపయినా కూడా మళ్ళీ కొత్తవారికే ఛాన్స్ ఇస్తున్నారు. వైల్డ్ డాగ్ ఆశించిన సక్సెస్ సాధించలేదనే విషయం అందరికీ తెలిసిందే. అయినా కళ్యాణ్ కృష్ణకు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ సినిమా బంగార్రాజు తెరకెక్కించే అవకాశం ఇచ్చాడు నాగ్. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నాగ చైతన్య కూడా హీరోగా నటించాడు. మల్టీస్టారర్‌గా నిర్మించిన ఈ సినిమా నాగార్జునకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
Nagarjuna: స్టార్ డైరెక్టర్స్‌తో అంటే భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ప్రస్తుతం ది ఘోస్ట్ అనే సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. అక్కడ ఇసుక ఎడారిలో ఛేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఐతే నాగార్జున కొత్తవారికి అవకాశాలు ఇవ్వడంలో స్వార్థం సంతృప్తి రెండూ ఉన్నాయని చెప్పుకుంటుంటారు. కొత్త దర్శకులలో ఓ కసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హిట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక వీరికి అవకాశం ఇవ్వడంతో బడ్జెట్ విషయంలో ఖర్చు తగ్గుతుంది. అదే స్టార్ డైరెక్టర్స్‌తో అంటే భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ నాగార్జున దృష్ఠిలో పెట్టుకొనే ఎక్కువగా కొత్త వారికి అవకాశాలిస్తారని టాక్ ఉంది.