NewOrbit
Entertainment News సినిమా

Nagarjuna: వందవ సినిమా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న నాగార్జున..??

Share

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా “విక్రమ్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా శివ సినిమాతో ఇండస్ట్రీలో అప్పట్లో నాగార్జున ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆ తర్వాత “నిన్నే పెళ్లాడతా” పలు రొమాంటిక్ సినిమాలు చేసి గ్రీకు వీరుడు ఇమేజ్ కూడా దక్కించుకోవడం జరిగింది.

Nagarjuna is planning his 100th film special
Nagarjuna

ఇంకా అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి పరమైన ప్రయోగాత్మకమైన సినిమాలతో కూడా సక్సెస్ సాధించారు. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో నాగార్జున తన మార్క్ చూపించడం జరిగింది. ఈ క్రమంలో తన 100వ సినిమా దగ్గర పడటంతో నాగార్జున చాలా స్పెషల్ ప్లాన్.. ఈ ప్రాజెక్టు విషయంలో వేసినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. కచ్చితంగా తన వందవ సినిమా అభిమానులను ఆకట్టుకునేలా బ్లాక్ బస్టర్ అయ్యేలా.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Advertisements
Nagarjuna is planning his 100th film special
Nagarjuna

విషయంలోకి వెళ్తే ఈ సినిమా మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున చేయనున్నారట. ఇక ఇదే సినిమాలో అక్కినేని అఖిల్ చేత కీలక పాత్ర..నాగ్ చేయించనున్నారట. గతంలో సిసింద్రీ, మనం సినిమాల్లో నాగార్జునతో అఖిల్ నటించిన జరిగింది. అయితే ఇప్పుడు 100వ సినిమాలో కూడా అఖిల్ చేత స్పెషల్ పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు నాగచైతన్య కూడా గెస్ట్ రోల్ చేసే తరహాలో స్క్రిప్ట్ మోహన్ రాజా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా నాగార్జున ఈ సినిమాను తీసుకున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. “అతడు” సీక్వెల్..??

sekhar

`గుణ 369` ఫ‌స్ట్ లుక్

Siva Prasad

వ‌రుస వాయిదాలు.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ` కార్తికేయ 2 ` హిట్టే!

kavya N