Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో వయసుతో నిమిత్తం లేకుండా.. కుర్ర హీరోలకు అన్నిరకాలుగా పోటీలు ఇస్తూ సినిమాలు చేస్తున్న హీరో నాగార్జున. సినిమాలు మాత్రమే కాక మరోపక్క బుల్లితెరపై కూడా కింగ్ నాగార్జున రాణిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5 లో.. హోస్ట్ గా నాగార్జున చేయనున్నారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన యుద్ధవిద్యలు నాగార్జున నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారట. ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్, క్రావ్ మగా… సమురాయ్ స్వార్డ్ ఫైటింగ్… ఇంకా పలు రకాల యుద్ధ విద్యలు ఆ దేశానికి సంబంధించినవి నేర్చుకోవడానికి నాగార్జున స్పెషల్ ట్రైనర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ప్రపంచంలో చాలా చిన్న దేశాలలో ఒక దేశమైన ఇజ్రాయిల్.. దాదాపు కొన్ని అరబ్ కంట్రీ ల మధ్య ఉంటుంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా కంటే చిన్నదిగా ఉన్న ఇదే దేశం దాదాపు చుట్టుప్రక్కల ఉన్న అరబ్ కంట్రీ లను హడలెత్తిస్తు ఉంటది. అమెరికా అయినా ఇజ్రాయిల్ అంటే భయపడే పరిస్థితి. ఏ దేశానికి తల వంచకుండా పోరాడుతూ.. శత్రువుల గుండెల్లో నిద్రపోతూ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటది. ప్రపంచంలో అన్ని దేశాల్లో విషయంలో ఒకలా వ్యవహరిస్తే ఇండియా దేశం విషయానికి వస్తే మాత్రం ఇజ్రాయెల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
Read More: Nagarjuna: నాగార్జున చేతి లోకి వచ్చినట్లు వచ్చి మిస్ అయిన సినిమాల లిస్టు..!!
భారత్ అంటే ఇజ్రాయిల్ దేశ పౌరులకు మాత్రమే కాక అక్కడి ప్రభుత్వాలకు కూడా ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే ఆ దేశ పౌరులు ఒకానొక సమయంలో సొంత భూభాగం నుండి చెదరగొట్ట పడిన తరుణంలో.. ప్రపంచంలో చాలా దేశాలు యూదులను చంపేశారు. కానీ ఒక్క భారత దేశం మాత్రం యూదులను అక్కున చేర్చుకుని వారికి.. అండగా నిలబడింది. ఆ కృతజ్ఞతతో ఇజ్రాయిల్.. భారత్ అంటే ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటది. కీలక సమయంలో ఇండియా కి అండగా ఉంటది. పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో ఇజ్రాయెల్ చేసిన హెల్ప్ ఎవరు మర్చిపోలేనిది. ఇండియా ఓటమి అంచులలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ఎంటర్ అయి ప్రత్యేకమైన యుద్ధ సామాగ్రిని అందించి భారత్ పాకిస్తాన్ నీ ఓడించటం లో కీలక పాత్ర పోషించింది. అటువంటి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి యుద్ధవిద్యలు నేర్చుకోవడానికి నాగార్జున ప్రస్తుతం రెడీ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.