Naga Shaurya Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీ కుర్ర హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడు అయ్యాడు. బెంగళూరులో కుటుంబ సభ్యుల మధ్య అనూష శెట్టి మెడలో మూడు ముళ్ళు వేయడం జరిగింది. బెంగళూరులో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి రెండు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరయ్యారు. ఈ క్రమంలో నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించి వీడియో నెట్టెంత వైరల్ గా మారింది. దీంతో చాలామంది అభిమానులు నెటిజన్ లు నాగశౌర్యకి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
30 సంవత్సరాల వయసు కలిగిన నాగ శౌర్య ..2011వ సంవత్సరములో సినిమా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలను అందుకోవడం జరిగింది. దాదాపు పది సంవత్సరాలు పాటు సినిమా కెరియర్ లో అనేక ఎత్తు పళ్లాలు చూసిన నాగశౌర్య విభిన్నమైన స్టోరీలతో.. ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇటీవల “కృష్ణ వ్రింద విహారి” సినిమా రిలీజ్ టైం లో ప్రమోషన్ కార్యక్రమంలో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు అమ్మాయినే చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే అప్పటి నుండి ఒకపక్క పెళ్లి పనులతో మరోపక్క సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నా నాగశౌర్య ఇటీవల కళ్ళు తిరిగి పడిపోయాడు. డిహైడ్రేట్ కారణంగా … నాగశౌర్య అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పటంతో.. సినిమా యూనిట్ కాస్త ఊపిరి పీల్చుకోంది. అనంతరం సినిమా షూటింగ్ ఆపేసి విశ్రాంతి తీసుకున్న నాగశౌర్య నవంబర్ 20వ తారీకు ఈరోజు బెంగళూరులో తన కాబోయే భార్య అనూష మెడలో మూడు ముళ్ళు వేయడం జరిగింది. నాగశౌర్య పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.