Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ నేడు హైదరాబాద్ జేఏసీ కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు అభిమానులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మహేష్ ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయించారు. దాదాపు 30కి పైగానే వంటకాలు తయారు చేయించి… భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి కి ప్రత్యేకంగా అభిమానులకు ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఎంట్రీ విషయంలో అభిమానులకు పాస్ లు కూడా జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యానికి గురైన సమయంలో కోడలు మహేష్ భార్య నమ్రత దగ్గరుండి మొత్తం చూసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి మహేష్ కుటుంబంలో అన్నయ్య రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి నాన్న కృష్ణ మరణించడంతో మహేష్ బాబుకి చాలా తోడుగా వెన్నంటే నమ్రత ఉంది. ఈ క్రమంలో నేడు కృష్ణ పెద్దకర్మ సందర్భంగా ఇన్స్టా గ్రామ్ లో నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “సినిమాలపై ఉన్న ప్రేమ ఆయనను సూపర్ స్టార్ నీ చేసింది. ఆయన్ని మామయ్య గారు అని పిలవడం నా అదృష్టం. ఆయన ద్వారా జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. ఆయన ఖ్యాతిని ఎప్పటికీ మేం పండుగలా జరుపుకుంటాం. లవ్ యు మామ అని రాసుకోచ్చింది.
కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి హైదరాబాదులో అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. అభిమానులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఘట్టమనేని కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్పీచ్ ఇస్తున్న సమయంలో మహేష్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది.