గత ఏడాది ‘కాలా’ చిత్రంతో దక్షిణాది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నానా పటేకర్. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే నానా పటేకర్ చాలా సంవత్సరాల తర్వాత దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చాడు. కోలీవుడ్ తర్వాత నానా పటేకర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వివరాల్లోకెళ్తే.. రానా, సాయిపల్లవి కాంబినేషన్లో ‘విరాటపర్వం 1992’ రూపొందనున్న సంగతి తెలిసిందే. జూన్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో టుబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు ఓ కీలక పాత్రలో నానా పటేకర్ నటించబోతున్నారట. నానా పటేకర్‌పై మీటూ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నానా పటేకర్ సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో ఆయన తెలుగులో సినిమా చేయబోతున్నాడనే వార్తలో ఎంత నిజముందో చూడాలి.
previous post
next post