నందమూరి బాలకృష్ణ మరో బయోపిక్‌లో నటిస్తారా? అనే సందేహం రాక మానదు. బాలకృష్ణ ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌లా నటించి, నిర్మించాడు. ఆ బయోపిక్ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మరోసారి బాలయ్య తన తండ్రి పాత్రలో నటించబోతున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను `తలైవి` అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. విష్ణు ఇందూరి నిర్మాతగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. ఇందులో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. జయలలిత సినీ కెరీర్లో పలువురు అగ్ర కథానాయకులతో నటించింది. అందులో సీనియర్ ఎన్టీఆర్‌తోనూ జయలలిత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమె బయోపిక్‌లో ఎన్టీఆర్ రోల్ కోసం విష్ణు ఇందూరి బాలకృష్ణను సంప్రదిస్తున్నారని టాక్. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.
previous post