Tarak: తెలుగు చిత్రసీమ సీనియర్ నటుడు అయినటువంటి N.T.రామారావు గారి మనుమడే నందమూరి తారకరత్న అన్న సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో పేరే తారక రత్న. కానీ ఇతడు హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఓ రకంగా చెప్పాలంటే ప్రేక్షకులకు తారకరత్న అనే హీరో ఉన్నాడనే సంగతే గుర్తు లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈయన పేరు మీద ఓ రికార్డు వుంది. ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన ఏకైక హీరో ఇతడే.
YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?
Tarak: నందమూరి తారకరత్న తాజా అప్ డేట్:
ఇకపోతే తారక రత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సారథి’ మోషన్ పోస్టర్ తాజాగా విడుదల అయింది. ట్విస్ట్ ఏమంటే ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్ ని మీరు చూసేయండి. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి, సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ చెబుతున్నారు దర్శకుడు జకట రమేష్.
l
Bheemla nayak: ట్రైలర్ ఫ్యాన్స్‌నే ఘోరంగా డిసప్పాయింట్ చేస్తే ఇక వారి సంగతేంటి..?
సినిమా వివరాలు:
ఇక ఈ నిర్మాతలు అయినటువంటి పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తారక రత్న దుమ్ములేపాడని అన్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారట. సిద్ధార్థ్ వాటికన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాకు మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నందమూరి తారక రత్న, వైశాలి, రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు, మారుతీ సాకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ తదితరులు నటిస్తున్నారు.