Taraka Ratna: నందమూరి తారకరత్న శనివారం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మరణించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మొదటి రోజు.. తారకరత్న గుండెపోటుకు గురికావడం తెలిసిందే. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం క్షీణించడంతో … కుప్పం నుండి బెంగళూరుకి తరలించడం జరిగింది. అక్కడ దాదాపు 23 రోజులపాటు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించిన గాని.. తారకరత్న ప్రాణాలు వైద్యులు కాపాడలేకపోయారు. వ్యక్తిగతంగా తారకరత్న అందరితో కలిసి ఉండే రకం కావడంతో ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని నందమూరి అభిమానులు పార్టీ కార్యకర్తలు భగవంతునికి ప్రార్ధనలు చేశారు. అయినా గాని ఆయన మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 20 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరత్న… తన మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. విషయంలోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎంట్రీ ఇచ్చే సమయంలో ఒకటి లేదా రెండు సినిమాలతో ఎంట్రీ ఉంటుంది. కానీ తారకరత్న కెరియర్ విషయంలో ఒకేసారి 9 సినిమాలతో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. తారకరత్న మొదటి తొమ్మిది సినిమాల షూటింగ్ లు ఒకేసారి ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే కాదు ఇప్పటికీ కూడా అది ఒక ప్రపంచ రికార్డే. ఎందుకంటే ఇప్పటికి కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. అన్ని సినిమాలతో వచ్చిన హీరో ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ ఇది తారకరత్న కెరియర్ లో జరిగింది. 2001వ సంవత్సరంలో “ఒకటో నెంబర్ కుర్రాడి”తో ప్రేక్షకులను పలకరించిన తారక రత్న తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశారు.
మధ్యలో కొద్దిగా ఇండస్ట్రీకి దూరంగా.. ఉన్నాగాని తర్వాత అడపాదడబా పాత్రలు చేస్తూ.. ఓటీటీ లలో వెబ్ సిరీస్ లు కూడా చేయడం జరిగింది. ఇక చనిపోకు ముందు ఒకపక్క సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూనే రాజకీయంగా ఎదగాలని పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. దీనిలో భాగంగా నారా లోకేష్ పాదయాత్ర మొదటిరోజు జాయిన్ అవ్వగా ఒక్కసారిగా గుండెపోటు రావడం పరిస్థితి విషమించడంతో బెంగళూరులో జాయిన్ అవ్వగా.. ఫిబ్రవరి 18వ తారీకు శనివారం మరణించారు. తారకరత్న మరణించడం పట్ల నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు టిడిపి పార్టీ కార్యకర్తలు నాయకులు కన్నీరుమున్నీరవుతున్నారు.