Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా సందడి చేశారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బోనికపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.హిందీలో ఎంతో విజయం సాధించిన “పింక్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించిన వకీల్ సాబ్ తెలుగులో కూడా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా థియేటర్ల ముందు పండగ వాతావరణాన్ని నెలకొల్పింది.
శృతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు. మంచి విజయంతో దూసుకుపోతున్న ఈ సినిమా విజయోత్సవాన్ని”మగువా ఇది నీ విజయం” పేరుతో హైదరాబాద్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వివిధ రంగాలలోని మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి కూడా హాజరయ్యారు.
Pawan Kalyan పవన్ కళ్యాణ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్:
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ… ముందుగా వకీల్ సాబ్ సినిమా విజయవంతం అయినందుకు చిత్ర బృందానికి కంగ్రాట్స్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాను అతని ఫ్యాన్స్ ఎక్కువ ప్రచారం చేసుకుంటారు.నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని అని అయితే తాను కేవలం ఒకే ఒక్కసారి కలిశానని నందినీరెడ్డి తెలియజేశారు.
అలా మొదలైంది సినిమా విడుదల తర్వాత ఒకసారి విదేశాలలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలియడంతో అనుకోకుండా ఎంతో భయంతో అతని కలిశానని, కానీ పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదపూర్వకంగా తనని మాట్లాడిన తీరు ఎప్పటికీ మరిచిపోలేనని నందిని రెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తప్పితే మిగిలిన వారందరూ కూడా పవన్ కళ్యాణ్ మాదిరి ప్రవర్తిస్తుంటారని నేనెప్పుడు నా ఫ్రెండ్స్ తో చెబుతుంటాను.
పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ కథను డైరెక్ట్ చేయడానికి సరైన వ్యక్తి వేణు శ్రీరామ్ అనుకున్నా, వేణు కూడా మహిళల పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారు. ఈ సినిమ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఇలాంటి కథలు దొరకడం చాలా అరుదు అంటూ ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడారు.