న్యూస్ సినిమా

Nani: రొటీన్ స్టోరీ..అయినా సుందరం అందరికీ నచ్చేస్తాడు..టీజర్‌లో లీకైన పాయింట్‌తో క్లారిటీ..

Share

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ అంటే.. సుందరానికీ.  ప్రస్తుతం నాని చేస్తున్నవన్నీ డిఫరెంట్ జోనర్ చిత్రాలు. గత ఏడాది చివరిలో శ్యామ్ సింగ రాయ్ సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత నానికి ఈ సినిమాతో హిట్ దక్కింది. ఇక త్వరలో అంటే..సుందరానికి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నజ్రియా నజీమ్ నటించింది. తమిళం, మలయాళ చిత్రాలలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది.

nani ante...sundaraaniki teaser released
nani ante…sundaraaniki teaser released

మొదటిసారి నాని సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ నుంచి నానీ ఫస్ట్ లుక్..మిగతా పోస్టర్స్ అన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినా అంటే..సుందరానికి చిత్రం నుంచి తాజాగా టీజర్ వదిలింది చిత్రబృందం. ఈ టీజర్ నానీ అభిమానులనే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీజర్‌తోనే అంచనాలు పెంచిన సుందరం మూవీ కథ కాస్త రొటీన్‌గానే అనిపిస్తోంది. ఇలాంటి పాయింట్‌తో గతంలో చంద్రమోహన్ – తులసి జంటగా ఒక సినిమా వచ్చింది.

Nani: ఈ సుందరం రొటీన్ జోనర్‌తో ఎలాంటి హిట్ అందుకుంటాడో.

ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక నాగ చైతన్య – సమంత కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావే పాయింట్ కూడా కాస్త ఇలాగే ఉంటుంది. హీరోయిన్ క్రిస్టియన్..హీరోది మరో హిందుమతం. ఇప్పుడు నాని – నజ్రియాల అంటే..సుందరానికీ కూడా పాత్రలు ఇవే. అయితే, ఇందులో నాని పాత్ర చాలా కామెడీగా డిజైన్ చేశాడు దర్శకుడు. నానీకి ఈ సినిమాలో మూలశంఖ ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దాంతో హీరో పడే ఇబ్బందులను కంప్లీట్ కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక క్లైమాక్స్ మాత్రం మాంచి ఎమోషన్స్‌తో ఉంటుందట. చూడాలి మరి ఈ సుందరం రొటీన్ జోనర్‌తో ఎలాంటి హిట్ అందుకుంటాడో.


Share

Related posts

ఒకపక్క సంతోషంగా మరొక పక్క కీర్తి పడుతున్న టెన్షన్ మామూలుగా లేదట ..?

GRK

టీడీపీ కాంగ్రెస్ పోత్తు పై చర్చ

sarath

ప్రభాస్ ని ఆరకంగా టచ్ చేసే స్టార్ హీరో ఇండియాలోనే లేడనడానికి ఇవే ప్రూఫ్స్.. !

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar