సినిమా

Nani: నాని న‌యా రికార్డ్‌.. పాత సినిమాతో ప‌ది కోట్లు!

Share

Nani: న్యాచుర‌ల్ స్టార్ నాని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషితో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ఈయ‌న ఒక‌రు. ఎప్పటికప్పుడు తెరపై కొత్తగా కనిపించడానికి ప్రయత్నించే నాని తాజాగా త‌న పాత సినిమాతో ప‌ది కోట్లు సంపాదించి ఓ న‌యా రికార్డ్‌ను సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

నాని, కీర్తి సురేష్ జంట‌గా త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `నేను లోక‌ల్‌`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2017 ఫిబ్రవరి 3న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

మ్యూజిక‌ల్‌గానూ ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. రూ. 18 కోట్ల‌తో నిర్మిత‌మైన ఈ సినిమా.. లాంగ్ ర‌న్‌లో రూ. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను యూట్యూబ్‌లో విడుద‌ల చేయ‌గా.. సినీ ప్రియులు నేను లోక‌ల్‌కు బ్రహ్మరథం ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ మూవీ యూట్యూబ్‌లో 100 మిలియన్ అంటే ప‌ది కోట్ల‌ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో అన‌తి కాలంలో అత్య‌ధిక వ్యూస్ సంపాదించిన చిత్రంగా నిలిచిన నేను లోక‌ల్.. నాని ఖాతాలో న‌యా రికార్డ్‌ను పడేలా చేసింది. కాగా, నాని ప్ర‌స్తుత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయన న‌టించిన `అంటే.. సుంద‌రానికీ!` త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే మ‌రోవైపు నాని `ద‌స‌రా` అనే చిత్రం చేస్తున్నాడు.


Share

Related posts

ఏరి కోరి మెహర్ రమేష్ తో చిరు సినిమా చేయడం వెనుక కారణమిదే… మీరు ఊహించలేరు!

sowmya

ష‌కీలా ల‌వ్ లెట‌ర్‌

Siva Prasad

Chiranjeevi: చిరంజీవి సినిమాలో కీలక పాత్రకు స్టార్ హీరోయిన్..!

Muraliak