నాని లేటెస్ట్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. మనకు తెలుగులో నాని ఎలాగో, తమిళ ప్రేక్షకులకు శివ కార్తికేయన్ అలాగన్నమాట. అంటే తెలుగులో మిడిల్ క్లాస్ హీరోతో `గ్యాంగ్ లీడర్` చేసిన ఆమె, తమిళ్లోనూ అదే రేంజ్ హీరోతో జోడీ కట్టనుంది. నయనతారతో `కోకో కోకిల` చిత్రాన్ని రూపొందించిన నెల్సన్ ఈ తాజా సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అక్కడ ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలుకానుంది. తెలుగు హీరోయిన్లు పలువురు ఇంతకు ముందు శివ కార్తికేయన్ సరసన జోడీ కట్టి స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ప్రియాంక తెలుగమ్మాయి కాకపోయినా, తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆమె చెన్నైలోనే ఉంటారు కనుక, శివ కార్తికేయన్ సినిమాకు తమిళ్ లో సొంతంగానూ డబ్బింగ్ చెప్పుకునే వెసులుబాటు ఉంది. ఆమె పాత్ర గురించి డీటైల్స్ తెలియాల్సి ఉంది.
previous post
next post