ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాని హీరోయిన్!

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా లో హీరోయిన్ చెల్లెలు వింధ్య పాత్రలో ఎంతగానో అల్లరి చేసిన బాల నటి సనూష, నాని నటించిన జెర్సీ సినిమాలో నానితో జతకట్టి అందులో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించి, అందరిని మరోసారి ఆకర్షించింది. ఇవే కాకుండా ఎన్నో తమిళ, మలయాళ సినిమాలలో నటించిన సనూష ఆమెకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ఆమె ఇటీవల ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సనూష కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ వీడియో గురించి నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

సనూష తన జీవితంలో ఒక సమయంలో వృత్తిపరంగా, కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దానివల్ల ఎంతో మానసికంగా కృంగి పోవడం వల్ల ఆత్మహత్య చేసుకుందామని భావించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కసారిగా భయం వేసిందని పేర్కొన్నారు. తరువాత ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని, డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నానని, చికిత్స తరువాత కొంత మేర తన ఆరోగ్యం కుదుటపడిందని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆమె తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన ఆ కామెంట్లను ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ నేను ఈ వీడియో పెట్టడానికి గల కారణం అలాగే ఎంతోమంది మానసికంగా బాధ పడే వారు ఈ వీడియోని చూసి కొంతమేర ధైర్యం నింపుకొని బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానని సనూష తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.