Nani: లాంగ్ గ్యాప్ తర్వాత `శ్యామ్ సింగరాయ్`లో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పుడు `అంటే.. సుందరానికీ!`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. `బ్రోచేవారేవరురా`, `మెంటల్ మదిలో` వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు తెరకెక్కించాడు.
ఇందులో మలయాళ ముద్దుగుమ్మ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈ మూవీలో అమెరికాకు వెళ్లాలని కలలు కనే అమాయకపు బ్రాహ్మణుడు సుందర్ ప్రసాద్ గా నాని నటిస్తే.. క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ చేసింది.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఇందులో భాగంగానే నిన్న వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీలోని సీఆర్ కాన్వోకేషన్ హాల్ లో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్లో నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. యూత్ సుందరాన్ని ఫాలో అవ్వద్దని, సుందరం కనిపించేటంత అమాయకుడు కాదని నాని చెప్పుకొచ్చారు. అలాగే తాను విశాఖ అల్లుడినని సాధారణంగా అల్లుడికి విందు ఇస్తారని, కాని ఈ నెల 10న తానే విశాఖ ప్రజలకు తన సినిమాతో విందు ఇవ్వబోతున్నట్టు చెప్పారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విడుదలైన ట్రైలర్‌కు సైతం మంచి రెస్పాన్స్ రావడంతో.. నాని మరో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…