మాస్ మహారాజా రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వం వహించగా.. ఇందులో రవితేజ్ ఎమ్మార్వో పాత్రలో కనిపించనున్నారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. జులై 29న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్మాతలు నిర్ణయించారు. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి, రాజకీయ నాయకులను ఎలా ఎదిరించు అనే కథాంశాంతో సినిమా తీశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్ జరిగింది. ఈ పంక్షన్ కు నేచురల్ స్టార్ నాని అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవితేజ తన సినిమా కెరీర్ స్టార్ట్ చేసే సమయంలో ఎలా అయితే చిరంజీవిని ఇన్ స్పైరింగ్ గా తీసుకున్నారో.. తమ జనరేషన్ లో తాను కెరీర్ మొదలుపెట్టిన సమయంలో అలాగే రవితేజను స్పూర్తిగా తీసుకున్నట్లు నాని చెప్పాడు. తాను వచ్చింది గెస్ట్ గా కాదని, రవి అన్న గురించి మాట్లాడటానికి అని నాని చెప్పాడు.
రవి అన్న చిరంజీవి కేర వ్యాన్ వెళ్లే సీన్ చూశానని, అది ఎంతో బాగుందని అన్నాడు. త్వరలో తాను కూడా అడుగు పెట్టాలనుకుంటున్నట్లు నాని చెప్పాడు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయని నాని చెప్పాడు. టీజర్, ట్రైలర్ చూశాక సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం పెరిగిందని నాని చెప్పాడు.
హనుమాన్ జంక్షన్ సినిమాలో వేణు, ఎల్బీ శ్రీరామ్ గారి ట్రాక్ తనకు చాలా ఇష్టమని, ఇప్పుడు మళ్లీ ఇలా రవితేజతో కలిసి రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని నాని చెప్పాడు. కాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించారు. 1995లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై మాస్ మహారాజా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఈ సినిమాతో దానికి కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!