Nani: `శ్యామ్ సింగరాయ్` వంటి భారీ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇందులో సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 10న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 9న శిల్పాకళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంతా బాగానే ఉంది కానీ.. `సుందరుడి` విషయంలో నానీని మాత్రం ఓ టెన్షన్ వదలడం లేదు. అదే `విక్రమ్`. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూన్ 3న విడుదలై.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
దీంతో కేవలం ఐదు రోజుల్లో రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన విక్రమ్.. వర్కింగ్ డేస్ లో కూడా ఊరమాస్ హోల్డ్ ని చూపిస్తూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రమ్ కి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో `అంటే.. సుందరానికీ` బరిలోకి దిగుతోంది. టాక్ బాగుతున్నా ఈ మూవీపై విక్రమ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే సుందరుడిని ఎవ్వరూ కాపాడలేరు. ఈ నేపథ్యంలోనే నాని కాస్త టెన్షన్ పడుతున్నారని టాక్ నడుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!