Nani: కరోనా ఫ్రీ తరువాత టాలీవుడ్ లో వరుస సినిమాలు రిలీజై పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో మొదటినుండి నిన్న మొన్నటి వరకు ఓ అంశం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసినదే. అదే సినిమా టికెట్ రేట్లు అంశం. అవును, గత కొంతకాలంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకముందు తక్కువ టికెట్ ధరలు తక్కువగా వున్న కారణంగా నష్టపోతున్నామని సినీ ప్రముఖులు ఆవేదన చెందితే.. ఇప్పుడు అధిక టికెట్ రేట్ల వల్ల జనాలు థియేటర్ల వైపు చూడకపోవడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు.
ఈ క్రమంలో ‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో.. తగ్గింపు టికెట్ ధరలతో’ అంటూ కొంతమంది తమ సినిమాలకు పోస్టర్స్ కూడా వేసుకొని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కప్పుడు టికెట్ ధరలు పెంచమని డిమాండ్ చేసి.. ఇప్పుడు రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేస్తున్నవారిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో నాని కూడా ఉండటం కొసమెరుపు. మొన్న రిలీజైన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. AP ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.
ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తూ జీవోలు జారీ చేశాయి కూడా. అయితే గతంలో సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించవద్దని చెప్పిన నాని, ఇప్పుడు తాను నటించిన ‘అంటే.. సుందరానికీ!’ సినిమాని తగ్గించిన టిక్కెట్ ధరలతో బుకింగ్స్ ఓపెన్ చేయమని డిస్ట్రిబ్యూటర్లను కోరుతూ, గతంలో అన్న మాటలకి ఎక్కడా పొంతన లేని విధంగా ఉన్నాడనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడు రేట్లు పెంచమని కోరిన నాని.. ఇప్పుడు తన సినిమాని తక్కువ టికెట్ ధరలతో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేయడంపై నెట్టింట ట్రోల్స్ రావడంతో ఈ తంతుపై హీరో నాని స్పందిస్తూ టిక్కెట్ ధరల సమస్యలపై నన్ను కామెంట్ చేసేవాళ్ళు తెలివి తక్కువవారు అని ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…