Nani: గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని.. ఇటీవల విడుదలైన `శ్యామ్ సింగరాయ్`తో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడీయ `అంటే.. సుందరానికీ!`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్‌ను బయటకు వదులుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా నాని ఈ మూవీకి సంబంధించి ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను తన అభిమానులకు తెలియజేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న `అంటే.. సుందరానికీ!` ట్రైలర్ వచ్చేస్తుంది.
మే 30వ తేదీ ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్‌ను బయటకు వదిలారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని బ్రహ్మణ యువకుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా అలరించబోతోంది.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…