నాని, విక్రమ్‌కుమార్ కాంబినేషన్లో `గ్యాంగ్ లీడర్` సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సినిమా టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే నాని, మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను తన సినిమాకు పెట్టుకోవడం కొంత మంది మెగాభిమానులకు మాత్రం నచ్చడం లేదు. దీంతో వారు #బాయ్‌కాట్ నానిస్ గ్యాంగ్ లీడర్ అంటూ ఓ గ్రూప్ క్రియేట్ చేసి నానికి వ్యతిరేకంగా మెసేజ్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఆ వ్యతిరేక వార్తలను ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో సాయిధరమ్ కూడా తన సినిమాకు గ్యాంగ్ లీడర్
అనే టైటిల్ పెట్టుకుంటామంటే మెగాఫ్యాన్స్ ఒప్పుకోలేదు. దీంతో సాయిధరమ్ తేజ్ తన ఆలోచనను విరమించుకున్నాడు. ఇప్పుడు చిరు టైటిల్‌ను నాని తన సినిమాకు వాడుకుంటుంటే.. మెగాభిమానులకు నచ్చడం లేదు. టైటిల్ మార్చుకోవాలంటున్నారు. .. నక్క వాతలు పెట్టుకుంటే పులికాదు.. పులి పులే, నక్క నక్కే, తెలుగు చిత్ర సీమలో ఒకే ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నాడు .. తనే మా మెగాస్టార్, కాబట్టి నాని టైటిల్ మార్చుకోవాలంటూ ట్రోలింగ్ చేస్తున్నారు మెగాభిమానులు. మరి దీనిపై నాని అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post