`ఫలక్‌నుమాదాస్` చిత్రంతో దర్శక నిర్మాతగా సక్సెస్ అందుకున్న హీరో విశ్వక్సేన్. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్కి ఆదరణ పెరిగింది. తదుపరి ఈ హీరో ఏ సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నానితో విశ్వక్ సేన్ సినిమా చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. రీసెంట్గా నాని, విశ్వక్సేన్ కలిసి చేయబోయే సినిమా గురించి డిస్కస్ చేసుకున్నారట. అన్ని ఫైనలైజ్ కావడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. అయితే విశ్వక్సేన్ సినిమాను నాని నిర్మించనుండటం మంచి పరిణామమేనని అందరూ అంటున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!