జూనియర్ ఎన్టీఆర్ 2001వ సంవత్సరంలో “నిన్ను చూడాలని” అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన “స్టూడెంట్ నెంబర్ వన్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇదే సమయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా సినిమాల్లో ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ చాన్నాళ్ల తర్వాత అదే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కారణం చూస్తే అప్పట్లో ఈ వార్తను ప్రచురించిన సంతోషం మ్యాగజైన్ అధినేత, సినీ నిర్మాత సురేష్ కొండేటి 2002వ సంవత్సరం నాటి సంతోషం సినీ వార్తా పత్రిక కవర్ పేజీ మీద ముఖ్యమంత్రి తనయుడు హీరోగా ప్రముఖ డైరెక్టర్ తేజ చిత్రం అనే శీర్షికతో ఉన్న ఫోటోను ట్విట్టర్లో ఇటీవల సురేష్ కొండేటి పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు లోకేష్ ఫస్ట్ సినిమా లోకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని, డైరెక్ట్ గా పొలిటికల్ గా కాకుండా సినిమాలు చేస్తూ వచ్చి ఉంటే కొంచెం పొలిటికల్ మైలేజ్ లోకేష్ కి ఉండేదని, సూపర్ స్టార్ ఫేమ్ ఖచ్చితంగా వచ్చేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మరోపక్క వైసిపి మద్దతుదారులు రాజకీయాల్లోకి రాకుండా, సినిమా రంగంలో రాణించి ఉంటే బాగుండేది అని ఎటకారంగా కామెంట్లు పెడుతున్నారు. కాగా అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న నేపథ్యంలో, తేజ చాలావరకు కొత్త నటీనటులను ప్రేక్షకులకు అద్భుతరీతిలో చూపించే దర్శకుడిగా పేరు ఉండటంతో…. సినిమాకి సంబంధించి చాలావరకు హోమ్ వర్క్ జరిగింది అని, కానీ చంద్రబాబే మధ్యలో వద్దని అన్నట్లు… తాజాగా వచ్చిన వార్తపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.