MAA: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులంతా కలిసి ‘మా’ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఈ అసోసియేషన్ ద్వారా సినీ ఇండస్ట్రీ కార్మికుల బాగోగులను తెలుసుకోవడం మాత్రమే కాక.. అనేక రీతులుగా సహాయం చేస్తూ నటీనటులను ఆదుకుంటూ ఉంటుంది “మా”. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం ఈ అసోసియేషన్ పనితనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి వంతు సహాయం అందిస్తూ ఉంటారు. లాక్ డౌన్ సమయం లో ఇండస్ట్రీలో షూటింగ్లో ఆగిపోవడంతో చాలా మంది సినీ కార్మికులను “మా” అసోసియేషన్ ఆదుకుంది.
ఇదే రీతిలో ఇండస్ట్రీలో నటీనటులు ఎవరైతే రిటైర్ అయ్యారో… వృద్ధులు ఎవరైతే డబ్బులు లేక ఆర్ధికంగా వెనుకబడ్డారో… అటువంటి వారిని గుర్తించి వారికి పెన్షన్ అందిస్తూ ఉంటుంది. అటువంటి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న నరేష్.. తాజా పరిస్థితుల్లో… మా సభ్యుడికి బి కి హెల్ప్ చేశారు. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ అనే మా సభ్యుడు… అతని కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో పాటు హాస్పిటల్ లో బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడటంతో… వెంటనే “మా” ప్రెసిడెంట్ నరేష్ నీ సంప్రదించడం జరిగింది.
వెంటనే నరేష్ స్పందించి రజినీకాంత్ కి అతని కుటుంబ సభ్యులకు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో బేడ్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక… వారికి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా నరేష్ యే దగ్గరుండి చూసుకోవడం జరిగిందట. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నరేష్ సరైన టైంలో ఒక కుటుంబాన్ని ఆదుకునేని “మా” ప్రెసిడెంట్ అనిపించుకున్నాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు… ప్రశంసిస్తున్నారు.