నాగ్‌కు మోది ట్వీట్‌


టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌కు ప్ర‌ధాని మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేశారు. ఇంత‌కు నాగార్జున‌కు మోది ఎందుకు ట్వీట్‌చేశారు? అస‌లు ఏం ఫేవ‌ర్ అడిగారు? అనే సందేహం కూడా రాక మాన‌దు. వివ‌రాల్లోకెళ్తే.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఓటు వేసేలా అంద‌రినీ చైత‌న్య ప‌ర‌చాల‌ని మోది నాగార్జున‌కు ట్వీట్ చేశార‌నేదే అస‌లు విష‌యం. “ఎన్నో సినిమాల ద్వారా ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న మీరు ఓట‌ర్ల‌ను చైత‌న్య ప‌రిచి.. ఎక్కువ‌గా పోలింగ్ అయ్యేలా ఇన్‌స్పైర్ చేయ‌గ‌ల‌రు“ అంటూ మోదిజీ నాగ్ మెసేజ్ పెట్టారు.