సాధారణ ఎన్నికలను తలపించేలాంటి ఎన్నికలు..
నిన్నటి వరకు స్నేహితులుగా కలిసి తిరిగిన వాళ్లే నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడ్డారు..
విమర్శల పర్వం కూడా చోటు చేసుకుంది.
ఇవన్నీ కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం జరుగుతున్న తంతు..
గత మా ఎన్నికల అధ్యక్ష పదవి ఏకగ్రీవం అయ్యింది.. శివాజీ రాజా గత అధ్యక్షుడిగా కొనసాగారు.. గత కార్యదర్శిగా కొనసాగిన నరేష్ (సీనియర్) మధ్య కొన్ని పనుల విషయంలో బేదాభిప్రాయాలు రావడంతో ఈసారి మా ఎన్నికలు తప్పలేదు. శివాజీ రాజా వర్గం ఒకవైపు.. నరేష్ వర్గం మరో వైపు పోటీ పడ్డాయి. రెండు వర్గాలు ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదాలు తీసుకునే ఎన్నికల బరిలోకి దిగారు.
పైకి ప్రశాంతంగా కనపడినా.. లోపల ఉత్కంఠత రేపుతూనే ఉంది. అసలు అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 745 ఓట్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డ్ స్థాయిలో 472 ఓట్లు పోలయ్యాయి.
ఆదివారం మధ్యాహ్నం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠతకు తెర దించింది. నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నరేష్ ప్యానెల్ నుండి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా ఎన్నికవగా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్.వి.కృష్ణారెడ్డి, హేమ… జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, శివ బాలాజీ ఎన్నికయ్యారు.
EC మెంబర్స్‌గా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి , అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కళ్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ గెలుపొందారు.
previous post
next post