Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ … సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య(Ramya).. ఇటీవల బెంగళూరులో(Bengaluru) మీడియా సమావేశం నిర్వహించి.. నటి పవిత్ర లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన భర్త తనకి దక్కకుండా పవిత్ర లోకేష్.. చేస్తుందని ఆరోపించింది. ఇదే సమయంలో తనకి విడాకులు ఇవ్వకుండానే.. నరేష్.. పవిత్ర లోకేష్ నీ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ రమ్య ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలోనే నరేష్ కి రెండు పెళ్లిళ్లు కాగా.. రమ్య మూడో భార్య. అయితే చాలా కాలం నుండి రమ్య… నరేష్ దూరంగా ఉంటున్నారు. అయితే అంతకుముందు “మా”(MAA) ఎలక్షన్స్ టైం లో నరేష్ పోటీ చేసిన క్రమంలో.. పవిత్ర లోకేష్.. నరేష్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించింది.
అప్పటినుండి వీరిద్దరి మధ్య బంధం మరింత బలంగా మారింది. ఇదిలా ఉంటే రమ్య ఇటీవల చేసిన కామెంట్లకు నరేష్ స్పందిస్తూ పవిత్ర లోకేష్ తనకు కేవలం స్నేహితురాలు వంటిది.. ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఇదే తరుణంలో పవిత్ర లోకేష్… రమ్య కావాలని నన్ను బ్యాడ్ చేయాలని హైదరాబాదు నుండి బెంగళూరులో మీడియా సమావేశం పెట్టిందని మండిపడ్డారు. నిజంగా కుటుంబంలో సమస్యలు ఉంటే.. నరేష్ తో మాట్లాడుకోవాలి. రమ్య నా గురించి మీడియా సమావేశం పెట్టడం ఏంటి అని ప్రశ్నించింది. నరేష్ తెలుగులో ఫేమస్ యాక్టర్. నరేష్ కి ఆత్మీయ అవసరంగా.. మానసికంగా అండగా నిలుస్తున్నాను అంటూ.. రమ్య చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ కౌంటర్ ఇచ్చింది.
ఈ ప్రకటనల అనంతరం రమ్య ఆదివారం ఉదయం మైసూర్(Mysuru)లో ఓ హోటల్ లో నరేష్.. పవిత్ర లోకేష్ జంట ఉన్నారని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి వాళ్లపై దాడికి దిగింది. పోలీసులు ఉన్నా గాని ఏకంగా చెప్పు తీసుకుని మరి.. నరేష్, పవిత్ర లోకేష్ పై విరుచుకుపడింది. ఈ మొత్తం తతంగం వీడియోలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తనపై దాడి చేయడానికి వచ్చిన రమ్యనీ మరింత రెచ్చగొట్టే రీతిలో నరేష్ వ్యవహరించాడు. మైసూర్ హోటల్ లో రమ్య ఈ రీతిలో చెప్పుతో.. నరేష్, పవిత్ర లోకేష్ లపై దాడికి పాల్పడిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…