నేచురల్ స్టార్ నాని హీరోగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాని 24వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాని బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్, మెగా అభిమానులకి భారీ షాక్ ఇచ్చారు. మెగాస్టార్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఎప్పటికైనా రామ్ చరణ్ తేజ్ రీమేక్ చేస్తాడనే ఆశతో ఉన్న మెగా ఫ్యాన్స్ , నాని గ్యాంగ్ లీడర్ గా రాబోతుండడం నిజంగా షాక్ ఇచ్చే విషయమే.
previous post
next post