సినిమా

Nayan-Vignesh: ఎట్ట‌కేల‌కు పెళ్లికి సిద్ధమైన న‌య‌న్‌-విఘ్నేష్.. ముహూర్తం ఖ‌రారు!?

Share

Nayan-Vignesh: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ లు గ‌త కొన్నేళ్ల నుంచీ గాఢంగా ప్రేమించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్ప‌టికే వీరి వివాహంపై ర‌క‌ర‌కాల వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసుకుంటూ వ‌చ్చిన ఈ ప్రేమ ప‌క్షులు ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు.

న‌య‌న్‌, విఘ్నేష్‌ల పెళ్లికి ఇరుకుటుంబ‌స‌భ్యులు ముహూర్తాన్ని కూడా ఖ‌రారు చేశార‌ట‌. జూన్ నెలలో వీరి పెళ్లి జరుగబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయని త‌మిళ్ మీడియా ప్ర‌చారం చేస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారం అయినా నిజమో కాదు తెలియాలంటే న‌య‌న్‌, విఘ్నేష్‌ల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

కాగా, ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార ఓ సినిమా చేసింది. అదే `కణ్మనీ రాంబో ఖతీజా(కణ్మనీ రాంబో ఖతీజా)`. ఇందులో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించ‌గా.. స‌మంత మ‌రో హీరోయిన్‌గా చేసింది. కొద్ది రోజుల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 28న ఈ త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

అలాగే న‌య‌న‌తార చిరంజీవితో క‌లిసి `గాడ్ ఫాద‌ర్‌` మూవీలో న‌టిస్తోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన `లూసిఫర్‌` కు ఇది రీమేక్‌ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే వీటితో పాటు న‌య‌న్ చేతిలో మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.


Share

Related posts

Lavanya Tripathi Amazing Images

Gallery Desk

ఉప్పెన క్లైమాక్స్ కి లేచి నిలబడి క్లాప్స్ కొట్టవలిసిందేనట!!

Naina

Corona Devi Statue: కరోనా దేవి విగ్రహం ఆ నటిలా ఉందంటూ ట్రోలింగ్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar