Chiranjeevi: గాడ్ ఫాదర్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార హైదరాబాద్‌లో దిగారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ రీమేక్ గాడ్ ఫాదర్. లూసీఫర్ సినిమాకు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతుండగా ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ నయతార, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఇక గతకొన్ని రోజులుగా హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాడిన విషయం తెలిసిందే. దాంతో చిరు లేని సన్నివేశాలను దర్శకుడు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ పాల్గొనగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కోసం ఇటీవలే హైదరాబాద్‌లో దిగిన నయన్ తాజాగా తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకొని తిరిగి చెన్నై బయలుదేరారట. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇక ఈ నెల 8వ తేదీ నుంచి చిరంజీవి తిరిగి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌తో పాటు భోళా శంకర్, బాబీ సినిమాల షూటింగ్‌లోనూ పాల్గొనబోతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ సన్నిహితుల నుంచి ఈ సమాచారం అందింది.
ప్రస్తుతం మెగాస్టార్ సన్నిహితుల నుంచి ఈ సమాచారం అందింది. కాగా, గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా త్వరలో హైదరాబాద్ చేరుకోనున్నారు. మెగాస్టార్, సల్మాన్ ఖాన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వారం నుంచి పదిరోజుల పాటు సల్మాన్ హైదరాబాద్‌లో స్టే చేయనున్నారు. వారం రోజులు షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇక నయనతార చిరుతో కలిసి సైరా తర్వాత రెండవ సారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!