GodFather: మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా “గాడ్ ఫాదర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలో చాలా పవర్ ఫుల్ రోల్ లో చూపించినట్లు ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలా సైలెంట్ యాక్షన్ లో మాటల డైలాగ్ లు కంటే కళ్ళతో చిరంజీవి నటన బాగా ఆకట్టుకోందని అంటున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సక్సెస్ సంబరాలు చేసుకుంటూ ఉంది.
ఇటీవలే సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇటువంటి తరుణంలో సినిమాలో సత్యప్రియ పాత్ర పోషించిన హీరోయిన్ నయనతార ..”గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ కి లెటర్ రాయడం జరిగింది. ఆ లేఖలో సినిమా విజయం సాధించడం పట్ల సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేసింది. సినిమాలో సత్యప్రియ పాత్ర పోషించటం చాలా ఆనందం కలిగించిందని నయనతార పేర్కొంది. అంతే కాదు “సైరా” తర్వాత మరోసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు “గాడ్ ఫాదర్” సినిమా యూనిట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని నయనతార తన ఆనందాన్ని లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సత్యప్రియ పాత్రలో నయనతార నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. నటనపరంగా నయనతార “గాడ్ ఫాదర్” లో తగిన న్యాయం చేసిందని సినిమా విజయం సాధించడంలో ఆమెను కూడా అభిమానులు మరొక పొగుడుతూ ఉన్నారు.