ఆ విషయంలో అనుష్క కంటే నయనతార బెటర్..??

సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లుగా గత కొంత కాలం నుండి ఓ వెలుగు వెలుగుతున్నరు నయనతార, అనుష్క. పాన్ ఇండియా హీరోయిన్లు గా క్రేజ్ వచ్చిన బాలీవుడ్ వైపు చూడకుండా సౌత్ ని మనసావాచా నమ్ముకుని దక్షిణాదిలో తిరుగులేని స్టార్ డామ్ తెచ్చుకున్న హీరోయిన్ లు. పెర్ఫార్మెన్స్ లో గాని వ్యక్తిత్వం లో గాని ఒకరికొకరు తీసిపోలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరి మధ్య డిఫరెన్స్ స్పష్టంగా బయటపడుతోంది.

Nayanthara vs Anushka Shetty: Who is the lady superstar? | IWMBuzzఒకరు అలా అంటే మరొకరు ఇలా అంటారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నయనతార తన కెరీర్ విషయంలో అనేక వివాదాలు ఉన్న ఎక్కడా కూడా తన గ్రాఫ్ పడిపోకుండా మెయింటైన్ చేయగలిగారు. పైగా ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసుకుంటూ అనేక విజయాలు సాధించారు. కానీ స్వీటీ అనుష్క మాత్రం ఏటువంటి వివాదాలకు పోకుండా ప్రయోగాత్మకమైన చిత్రాలకి చాలా దూరంగా మొన్నటి వరకు రాణించారు. కానీ “బాహుబలి” తర్వాత అనుష్క చేసిన సినిమాలు పరాజయం పాలు కావడంతో మొట్టమొదటిసారి “నిశ్శబ్దం” అనే ఎక్స్పరిమెంట్ సినిమా చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో అర్థం కాని పరిస్థితి.

 

అంతే కాకుండా ఈ సినిమా తర్వాత అనుష్క చేతిలో రెండు కోలీవుడ్ సినిమాలు అంటున్నా కానీ అవి కన్ఫామ్ కాలేదు. భాగమతి తర్వాత ఆ రెంజ్ లో స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరించలేకపోయింది అనుష్క. మరోపక్క ప్రయోగాత్మక చిత్రాలకు ధైర్యం చేయకపోవడంతో సమాన క్రేజు నయనతారతో ఉన్నాగాని నయన్ అంతా క్రేజ్ అనుష్క మెయింటెన్ చేయలేక పోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ప్రయోగాత్మక చిత్రాలు చేయటంలో అనుష్క కంటే నయనతార కి గట్స్ ఎక్కువ అని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.