గతంలో టాప్ రేంజ్ హీరోయిన్లు కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి. విజయశాంతి – రాధ, రమ్యకృష్ణ – సౌందర్య, రోజా – మీనా.. ఇలా గత జనరేషన్స్ లో ఇలా నటించారు. కానీ.. ప్రస్తుత జనరేషన్ ఈ కలయిక దాదాపు అసాధ్యంగా మారింది. త్రిష – శ్రియ కలిసి చేసినా అది వారి కెరీర్ ప్రారంభంలో జరిగింది. అయితే.. ఇన్నేళ్లకు సౌత్ ఇండియా అదిరిపోయే న్యూస్ ఇటివల వచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తున్న సినిమా ఒకటి అనౌన్స్ అయింది. వారిద్దరే నయనతార – సమంత.
నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమాను ఆరు నెలల క్రితమే అనౌన్స్ చేసి మోషన్ టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్స్ నయనతార – సమంత పేర్లు కూడా వేశారు. అయితే.. తర్వాత రోజుల్లో ఈ సినిమా నుంచి సమంత తప్పుకుందని వార్తలు వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ వార్తలు ఎక్కువగానే వైరల్ అయ్యాయి. అయితే.. ఇవన్నీ పుకార్లేనని ఈరోజు తేలిపోయింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ‘కాదువాకుల రెండు కాదల్’ అనే ఈ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ కార్యక్రమంలో నయనతార, సమంత లేకపోయినా సమంత నటిస్తున్నట్టు టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో అంచానాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రయాంగులర్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పైగా నయనతార, సమంత.. కలిసి నటించడం.. విజయ్ సేతుపతి హీరో కావడం మరింత స్పెషల్ గా మారింది. గతంలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – నయనతార కాంబినేషన్ లో ‘నాన్ రౌడీ దాన్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విఘ్నేశ్ శివన్ – నయనతార ప్రేమలో పడ్డారు.