Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, కరోనా వల్ల వీరి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అయితేనేం.. పెళ్లైన జంట కంటే అన్యోన్యంగా నయన్, విఘ్నేష్‌లు ఉంటారు.
అలాగే సమయం దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటారు. ఇకపోతే నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా.. విఘ్నేష్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. 13 అర్థ్ర రాత్రే రెడ్ రోజెస్‌తో చేసిన ఫ్లవర్ బొకేతో విఘ్నేష్ శివన్ నివాసానికి వెళ్లింది. నయన్ రాకను తెలుసుకున్న విగ్నేష్ బయటకి వస్తుండగా.. వెంటనే బొకే ఇచ్చి అతడిని మనసారా హత్తుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన విఘ్నేష్ శివన్.. `ఆమె పూలతో దగ్గరకు రాగానే మొదటిసారి కలిసిన ఫీలింగ్. ఖచ్చితంగా ఇది హ్యాపీ వాలెంటైన్స్ డే` అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నయన్-విఘ్నేష్‌ల మధ్య ఉన్న ఘాడమైన ప్రేమను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
కాగా, నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె విఘ్నేష్ దర్శకత్వంలోనే `కాతువాకుల రెండు కాదల్` అనే సినిమా చేస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్` చిత్రంలోనూ నయన్ నటిస్తోంది.
https://www.instagram.com/reel/CZ8y_2QvO7Y/?utm_source=ig_web_copy_link