సినీ ఇండస్ట్రీలో కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉంటాయి. వారి కలయికలో వచ్చే సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఆ కోవకే చెందుతారు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి. వీరి కాంబినేషన్లో గతంలో సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు బోయపాటి. మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు జనవరి మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్లో విడుదల చేయనున్నారు. మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.