NBK 107: నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుండి చాలా శరవేగంగా సాగుతోంది. అయితే ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. వైట్ అండ్ వైట్ లో… బాలయ్య బాబు కత్తి పట్టుకుని.. ఉగ్ర రూపంలో కనిపించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నందమూరి తారక రామారావు కి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపీచంద్ మలినేని.. ఇండస్ట్రీలో వరుస పెట్టి విజయాలు సాధిస్తూ ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి టైటిల్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వచ్చే నెల బాలకృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజు టైటిల్ తో కూడిన వీడియో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ బాలయ్య బాబు..లుక్ కి ఫిదా అవుతున్నారు. మరోసారి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రోజులు పోస్టర్ చూస్తే గుర్తొస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ బ్లాక్ షర్ట్ లో కనిపించగా ఇప్పుడు వైట్ అండ్ వైట్ లో కనిపించడంతో కచ్చితంగా ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో కంటెంట్ ఉన్న సినిమా అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా పోస్టర్ పై వేట మొదలయ్యింది అనే కామెంట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వచ్చే దసరాకి ఈ సినిమా రిలీజ్ కానుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.