మహానాయకుడు వచ్చేది ఆ రోజే

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘U’ స‌ర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్ర‌వ‌రి 22న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ గారి రాజ‌కీయ జీవితం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ NBK ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను నిర్మించారు.