ఆమె అతని ఉనికి

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే రిలీజ్ చేసి వర్మ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ ట్రైలర్ తో వర్మ అభిమానులలో, ప్రేక్షకులలో ఆసక్తిని అమాంతం పెంచేశారు. తాజాగా ఈ సినిమాలో తొలి వీడియో పాటను విడుదల చేశారు. నీ ఉనికి.. అని సాగే ఈ పాటలో.. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి పాత్రలపై చిత్రీకరించింది, బహుశా ఇది క్లైమాక్ పాట అయిఉండవచ్చు. ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని వెల్లడించారు. దివంగత ఎన్టీఆర్ సినిమాల్లోని పాటల్లో చాలావరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆలపించారని గుర్తుచేశారు.