మళయాలంలో నీలకంఠ ‘జామ్ జామ్’

Share

మళయాలంలో తెలుగు దర్శకుడు నీలకంఠ ‘జామ్ జామ్’*
బాలీవుడ్ లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ అతిపెద్ద విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే …
మళయాలంలో ‘జామ్ జామ్’ పేరు తో తెరకెక్కుతోన్న ఈ మూవీ లో
మంజిమా మోహన్ కథానాయిక.
కేవలం మలయాళ వెర్షన్ కు మాత్రమే మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించారు ..
 తెలుగులో షో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం విశేషం..
ఇక రీసెంట్ గా ఈ రీమేక్ కు సంబంధించిన నాలుగు భాషల టీజర్స్ విడుదలయ్యాయి.
మళయాల వెర్షన్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. రీమేక్ అయినా అత్యంత సహజంగా కేరళ నేచురాలిటీకి దగ్గరగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ కు అద్బుతమైన స్పందన రావడం విశేషం …
త్వరలో ట్రయిలర్ మరియు సినిమ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు …
ఇక మీడియెంట్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మంజిమా మోహన్ తో పాటు సన్నీవేన్, షిబానీ దండేకర్, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగానూ అత్యున్నతంగా కనిపిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మిచెల్లే టబురెక్సీ, సంగీతం : అమిత్ తివారీ, ఎడిటింగ్ : ప్రదీప్ శంకర్ , రచన : విపిన్ రాధాకృష్ణ,సహ నిర్మాత : పారుల్ యాదవ్, నిర్మాత : మను కుమరన్, స్క్రీన్ ప్లే  దర్శకత్వం : నీలకంఠ.

Share

Related posts

హీరోయిన్‌కు బాల‌య్య మ‌రో చాన్స్‌

Siva Prasad

ఒకే ఒక్క సినిమా తో  రామ్ గోపాల్ వర్మ డబ్బు సంపాదన ఎంతో తెలుసా ?

siddhu

నయనతార ని అలాంటి పాత్ర లో ఊహించుకోవడం కష్టమే ..?

GRK

Leave a Comment