ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ .. ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతోంది. ఆన్లైన్ స్ట్రీమింగ్‌లో అన్ని భాషల సినిమాలకు చోటిస్తూ… కొత్త కొత్త వెబ్ సిరీస్‌లు రూపొందిస్తోంది. అయితే టాలీవుడ్ దగ్గరకు వచ్చేసరికి … కాస్త ఇబ్బందిపడుతోందట. ఇక్కడి సంస్థలతో ఈ బడా కార్పొరేట్ సంస్థ ఇమడలేకపోతోందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్‌కు ఆర్కే మీడియాకు మధ్య పంచాయతీయే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే.. బాహుబలి వెబ్ సిరీస్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చింది. మొత్తం 18 ఎపిసోడ్లు చేయాలని తమ ప్లాన్‌ను ముందు పెట్టిందట. దాదాపు 100 కోట్లు ఆఫర్ చేసిందట. దీనికి ఓకే చెప్పిన ఆర్కే మీడియా.. దేవ కట్టా, రాజమౌళి తదితరులతో కొన్ని ఎపిసోడ్లు చేసి .. నెట్‌ఫ్లిక్స్‌కు చూపించిందట.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా… వాటిని చూసిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొందని టాక్. మళ్లీ చెయ్యాలని నెట్‌ఫ్లిక్స్.. కాదు కుదరదని ఆర్కే మీడియా భీష్మించుకు కూర్చున్నాయట. ఈ వివాద పరిష్కారానికి ఎవరూ ఒకడుగు వెనక్కి వేయడం లేదు. మరి ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి!
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!