Categories: సినిమా

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు రాజమౌళి చుట్టూ తిరుగుతున్నాయి.. నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్!

Share

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తరువాత జక్కన్న పేరు నలుమూలలా వ్యాపించింది. ఇక ఈ సంవత్సరం రిలీజైన RRR సినిమా అతని వైభవాన్ని సుస్థిరం చేసింది. ఈ సినిమాకి హాలీవుడ్ క్రిటిక్స్ సైతం జేజేలు కొడుతున్నారు. అందుకే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా జక్కన్నతో కలిసి వర్క్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆమద్య ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా కూడా ఆ మధ్య చెప్పుకొచ్చాడు.

Netflix ఆఫర్ ఇదే:

తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 100 కోట్ల భారీ ఆఫర్ ను రాజమౌళికి ఇచ్చిందనే వార్తలు తెలివుడ్లో గుప్పుమంటున్నాయి. RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో రాజమౌళితో భవిష్యత్తులో వర్క్ చేయాలనే యోచనతో ఉందట Netflix. రాజమౌళితో ఒరిజినల్ కంటెంట్ ను నిర్మించేందుకు భారీ బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లుగా సమాచారం. స్క్రిప్ట్ నేపథ్యం ఏదైనా పర్వాలేదు గాని, ఒక వెబ్ సిరీస్ ను మా కోసం చేయాల్సిందిగా జక్కన్న కు ఈ ఆఫర్ ను నెట్ ఫ్లిక్స్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. అయితే జక్కన్నను ఆ ఆఫర్ టెంప్ట్ చేయలేదు.

కారణం ఇదే:

ప్రస్తుతానికి జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. కనుక నెట్ ఫ్లిక్స్ వారి యొక్క ప్రపోజల్ కు రాజమౌళి ఓకే చెప్పే అవకాశాలు కనిపించడం లేదు అని సినిమా పండితుల మాట. ఇంకో విషయం ఏమంటే, రాజమౌళి ఇక్కడ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడనేది నిర్వివాదాంశం. అయితే అతగాడు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన శిష్యులతో అయినా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ తో అసోషియేట్ అవ్వాల్సిందిగా వారు కోరుతున్నారట. అందుకు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారని వినికిడి. అయితే జక్కన్న ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

35 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

39 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

56 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago