బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున నీ ఇంటిలో ఉన్న సభ్యులంతా సార్ అని పిలుస్తుంటే సుజాత మాత్రం బిట్టు అని పిలవడం పట్ల బయట వ్యతిరేకత ఉన్న కొద్దీ పెరుగుతుంది. స్టార్టింగ్ లో నాగార్జున మీ నవ్వు బాగుంటుంది అని సుజాత ని పొగిడినందుకు షోలో నాగార్జున వచ్చిన ప్రతిసారి ఏదో రీతిలో నవ్వని సందర్భం అయిన సుజాత నవ్వటం.. పట్ల సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి.
సుజాత ది ఫేక్ స్మైల్ అని… నాగార్జున ని ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడుతుంది అని కావాలని నవ్వుతుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సుజాతను ట్రోల్ చేస్తున్నారు. హౌస్ లో ఇంటి సభ్యులు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో అయినా నాగార్జునను సార్ అని పిలుస్తుంటే సుజాతా మాత్రం గౌరవం లేకుండా బిట్టు అని పిలవడం పట్ల నాగార్జున అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆమెను నామినేషన్లో పడేయండి ఇంటికి పంపించకపోతే అప్పుడు అడగండి అంటూ కంకణం కట్టుకుంటున్నారు.
పైగా హౌస్ లో సుజాత ఓవరాక్షన్ ఎక్కువైందని బయట తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల కెమెరా ముందు ఒకేసారి ఏడ్చి మళ్లీ అదే సందర్భంలో నవ్వటం మెంటల్ తెప్పించే దానిలాగా వ్యవహరించింది అన్న టాక్ ఉంది. ఎవరిపైన అయినా జోక్ వేస్తే నవ్వుతున్న సుజాత తన పై సరదాగా ఎవరైనా మాట అన్న గాని సీరియస్ తీసుకోవటం… చాలామందికి నచ్చటం లేదు. దీంతో సుజాత ప్రవర్తనపై పై సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రమేకాక నాగార్జున ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఆమె ఎప్పుడు నామినేషన్ లోకి వెళ్తే అప్పుడు బయటకు పంపించడానికి తెగ ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లు చూపిస్తున్నట్లు టాక్.