Samantha: సమంత.. గత కొద్ది రోజుల నుంచీ ఈ పేరు అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ మారుమోగిపోతోంది. ఈమె ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అందుకు కారణం భర్త నాగచైతన్య నుంచి విడిపోవడమే. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెద్దల సమక్షంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే సామ్, చైలు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. అప్పటి నుంచీ ఏదో ఒక కారణం చేత సామ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలను టేకప్ చేస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమంత.. తాజాగా `బ్లెండర్స్ ప్రైడ్` అనే ఆల్కహాల్ బ్రాండ్‌ని ప్రమోట్ చేసింది.
సదరు బ్రాండ్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో కూడా నటించి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సమంతపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్స్ డబ్బు కోసం మద్యం బ్రాండ్స్ కు అంబాసిడర్ లుగా వ్యవహరించి చివాట్లు తిన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు సమంత కూడా అదే చేసింది. పైగా ప్రమోషనల్ వీడియోలో బోల్డ్‌గా నటించి షాక్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు సామ్‌పై మండిపడుతున్నారు. ఆల్కహాల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడమే తప్పంటే.. సదరు బ్రాండ్ కోసం అంతలా అందాలు ఆరబోయాలా అంటూ విమర్శలు కురిస్తున్నారు. దీంతో మళ్లీ సమంత వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.
https://www.instagram.com/reel/Ca3mVBSo4Jp/?utm_source=ig_web_copy_link