Dethadi Harika: దేత్తడి హారిక.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో యూట్యూబ్ స్టార్‌గా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీమె. ముఖ్యంగా తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ హారిక ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రేజ్‌తోనే బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశాన్ని కొట్టేసింది.
ఈ షోలో ఫైనల్స్ వరకు వెళ్లింది. కానీ, టైటిల్‌ను మాత్రం గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, అల్బమ్ సాంగ్స్‌తో పాటు అడపా తడపా సినిమాలు సైతం చేస్తున్న హారిక.. తాజాగా తన అతి ఉత్సాహంతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది.
అసలేం జరిగిందంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన ఓ వీడియోను ఫేస్బుక్ ద్వారా ఫోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకు ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కానీ, ఇక్కడే హారిక పప్పులో కాలేసింది. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది.
ఇంకేముంది.. నెటిజన్లు ఆమెకు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. హారిక పక్కా తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఇంగ్లీష్ పాప మాదిరి తెగ బిల్డప్ ఇచ్చింది. దాంతో నాగార్జున సైతం ఆమెపై చిరాకు పడ్డారు. అయినా తన తీరును మార్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పెల్లింగ్ విషయంలో అడ్డంగా బుక్ అవ్వడంతో.. ఆమెను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.