Allu Arjun-Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహాల గారాల పట్టి అల్లు అర్హ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ చిన్నారి చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అర్హ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఐదేళ్ల అర్హ త్వరలోనే సిల్కర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేకర్ రూపొందించిన `శాకుంతలం` మూవీతో అర్హ సినీ గడప తొక్కబోతోంది.
గుణ టీం వర్క్స్, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్హ కారణంగా బన్నీ దంపతులు ట్రోలింగ్‌కు గురయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేం జరిగిందంటే.. రీసెంట్గా అల్లు అర్జున్ కు పిల్లనిచ్చి మామ, స్నేహా తండి కె. చంద్రశేఖర్ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూకి తాతతో కలిసి అర్హ కూడా వెళ్లింది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా `నీ పేరేంటి..?` అని యాంకర్ ప్రశ్నించగా.. వెంటనే `అల్లు అర్హ రెడ్డి` అని సమాధానం ఇచ్చి తెలియకుండానే నోరు జారింది.
ముద్దులొలికే మాటలతో అర్హ చెప్పిన ఆ సమాధానం నెటిజన్లకు ఏ మాత్రం నచ్చలేదు. కులంతో సహా పేరు చెప్పడంతో చాలా మంది షాక్ అయ్యారు. దీంతో నెట్టింట రచ్చ మొదలైంది. పిల్లలకు ఏం నేర్పుతున్నారు? ఇంత చిన్నప్పటి నుంచి వారిని కులం పిచ్చిలోకి తోయడం ఏంటీ? అంటూ బన్నీ దంపతులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.