Keerthy Suresh: ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఈమె నటించిన మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబుకు జోడీగా `సర్కారు వారి పాట` సినిమా చేస్తోంది.
అలాగే న్యాచురల్ స్టార్ నాని సరసన `దసరా` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్ `గాంధారి` అనే వీడియో సాంగ్ చేసింది. ది రూట్, సోని మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా నిర్మించిన ఈ వీడియో సాంగ్కు సి.హెచ్. పవన్ దర్శకత్వం వహించాడు. మూడు రోజుల క్రితమే యూట్యూబ్లో విడుదలైన ఈ పాట నెటిజన్లు అద్భుతంగా ఆకట్టుకుంది.
`గాంధారీ గాంధారీ.. నీ మరిది గాంధారీ .. దొంగ చందమామలాగా వంగి చూసిండే` అంటూ సాగిన ఈ పాట లో కీర్తి సురేష్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత ఎంతో మంది ఆమెపై ప్రశంసలు కురిపించారు. కానీ, కొంత మందికి కీర్తి సురేష్ ఇలా వీడియో సాంగ్ చేయడం ఏ మాత్రం నచ్చలేదు.
స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీర్తి సురేష్ ఇలాంటి బీ గ్రేడ్ మ్యూజిక్ వీడియోలో నటించడం పట్ల కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు కీర్తిపై మరింతగా మండిపడుతున్నారు.