సినిమా

Pooja Hegde: పూజా హెగ్డేకు షాకుల మీద షాకులు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

Share

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బుట్ట‌బొమ్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక లైలా కోసం` తో సినీ గ‌డ‌ప తొక్కిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి.. `దువ్వాడ జగన్నాథం` తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యవంత‌మైన చిత్రాలు చేస్తూ ల‌క్కీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

కానీ, ప్ర‌స్తుతం మాత్రం పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. ఇన్న‌ళ్లు బ్రేకుల్లేని హిట్స్‌తో దూసుకువ‌చ్చిన ఈ బ్యూటీకి.. ఇప్పుడు షాకులు మీద షాకులు త‌గులుతున్నాయి. నేష‌న‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో ఆమె న‌టించిన `రాధేశ్యామ్‌` ఇటీవ‌లె విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత విజ‌య్ ద‌ళ‌ప‌తితో క‌లిసి న‌టించిన `బీస్ట్‌` కూడా బోల్తా ప‌డింది.

వ‌ర‌స‌గా రెండు పెద్ద ఫ్లాపులు ప‌డ‌టంతో.. కొంద‌రు పూజా హెగ్డేపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేసి ట్రోల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఈ భామ‌ నిరుత్సాహ ప‌డ‌కుండా `ఆచార్య‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది.

క‌థ‌, క‌థ‌నం రెండు చ‌ప్ప‌గానే ఉన్నాయి. కొర‌టాల మ్యాజిక్ ఇందులో ఏ మాత్రం క‌నిపించ‌లేదు. అలాగే ఇందులో చిరంజీవికి హీరోయిన్ లేదు.చరణ్ కి జోడీగా తీసుకున్న పూజ హెగ్డే పాత్రను ప్రాధాన్య‌త లేదు. దాంతో ఆమె వ‌ల్ల సినిమాకు ఎలాంటి ప్రయోజనం లేకుండానే పోయింది. ఇక తొలి రోజే ఆచార్య నెగ‌టివ్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో.. పూజా హెగ్డే ఖాతాలో మ‌రో ఫ్లాప్ ఖాయ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ చేస్తూ ఆమెను ఆడుకుంటున్నారు.


Share

Related posts

Chitram : చిత్రం సినిమా సీక్వెల్ ‘చిత్రం 1.1’ ని ప్రకటించిన తేజ.. త్వరలో సెట్స్ మీదకి..!

GRK

Kamal Haasan: కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ సినిమా షురూ!

Ram

పవన్ కళ్యాణ్ సినిమాలో సాయి పల్లవిని ఒప్పించడం చిన్న విషయం కాదు.. !

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar