New posters: విజయవంతంగా 2021 ఏడాదికి టాటా చెప్పేసి 2022లోకి అడుగుపెట్టేశాం. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా గత చేదు జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవాలని ఆకాంక్షతో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ సరికొత్త పోస్టర్స్ ని విడుదల చేస్తున్నారు. ఇక ఈ ఏడాది వారికి ఏ అడ్డంకి రాకూడదని, సజావుగా సినిమాలు థియేటర్లలో రిలీజు కావాలని ఆకాంక్షిద్దామా! తాజాగా రిలీజైన సినిమాల జాబితా చూసేయండి మరి.
Breaking: వాయిదా పడ్డ RRR మూవీ.. ప్రకటించిన చిత్ర బృందం..
తాజాగా రిలీజైన సినిమాల జాబితా ఇదే..
అందులో మొదటి సినిమా పోస్టర్ ”ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చెప్పాలి. తాజాగా సదరు మూవీ టీమ్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో శర్వానంద్ – రష్మిక మందన్నా పెళ్లి దుస్తుల్లో తళతళలాడిపోతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అయినటువంటి బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ”స్వాతిముత్యం” పోస్టర్ రిలీజ్ అయ్యింది.
మిగిలిన చిత్రాల పోస్టర్లు ఇవే..
అలాగే రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హైవే”. కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ యొక్క పోస్టర్ తాజాగా రిలీజై సందడి చేస్తోంది. ఇది నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రాబోతోంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ మంచి ఉత్సాహంగా వున్నారు. ఇక తాజాగా రిలీజైన ఈ చిత్రాల పోస్టర్లు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.