రాజమౌళి “RRR” సినిమాకు కొత్త కష్టాలు..!!

“బాహుబలి” సినిమా విజయంతో దేశవ్యాప్తంగా తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్నాడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని ఇండస్ట్రీలలో “బాహుబలి” సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో బాహుబలి తర్వాత జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ “RRR“. మహమ్మారి కరోనా వైరస్ రాకపోయి ఉంటే ఈ సినిమా 2021 సంక్రాంతి పండుగకు రిలీజ్ అయి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.

RRR: Jr NTR and Ram Charan's film with SS Rajamouli postponed to 2021?కరోనా వైరస్ రావటంతో లాక్ డౌన్ కారణంగా మార్చిలో ఆగిపోయిన ఈ షూటింగ్ ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ కాలేదు. గత నెలలో షూటింగ్ ప్లాన్ చేసిన అదే సమయంలో రాజమౌళి ఫ్యామిలీ కి కరోనా సోకడంతో ఆ ఆలోచనలు పక్కన పెట్టేశారు. ప్రజెంట్ పరిస్థితులు సద్దుమణగాడంతో షూటింగ్ స్టార్ట్ చేయటానికి రెడీ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి.

ఈ నేపథ్యంలో షూటింగ్ కి హాజరవడానికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ రెడీ గానే ఉన్న జక్కన్న కి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి అట. లీడ్ స్టార్స్ రెడీ గానే ఉన్నా సపోర్టింగ్ రోల్స్ కి సంబంధించిన ఆర్టిస్టుల డేట్లు సెట్ కావడం లేదట. ఇప్పటికే అన్ని సినిమాల షూటింగ్ స్టార్ట్ కావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టు అంత బిజీ అయిపోయారు అంట. దీంతో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల విషయంలో రాజమౌళి కి కొత్త కష్టాలు మొదలైనట్లు ఫిలింనగర్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.