తవ్వేకొద్దీ కొత్త ట్విస్టులు, రూ. 15 కోట్ల బదిలీపై ఫోకస్ సుశాంత్ ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్

Share

సుశాంత్ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి పై ఆరోపణలు చేసినప్పటి నుండి ఈ కేసు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. అప్పటి వరకు బాలీవుడ్ పెద్దలు, నేపోటిజం చుట్టూ తిరిగిన ఈ కేసు హఠాత్తుగా రియా మెడకు చుట్టుకుంది. సుశాంత్ తో చివరి వరకు ఉంది గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి. పైగా ఆమె బ్యాంక్ అకౌంట్ పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

New twists as you dig, Rs. Focus on 15 crore transfer New twist in Sushant suicide
New twists as you dig, Rs. Focus on 15 crore transfer New twist in Sushant suicide

ఇందువల్లే సుశాంత్ ఫ్యామిలీ రియా పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా సుశాంత్ తండ్రి కేకేసింగ్ బీహార్ రాష్ట్రంలో కంప్లైంట్ చేసిన కేసును… ముంబై పోలీసులకు అప్పగించాలని రియా చక్రవర్తి న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తారీఖున విచారణ జరపనుంది.

పరిస్థితి ఇలా ఉండగా సుశాంత్ అకౌంట్ నుంచి ప్రియురాలు రియా చక్రవర్తి 15 కోట్లు ఓ అజ్ఞాత వ్యక్తి కి బదిలీ చేసినట్లు సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణలో…. సంచలన మలుపులు తిరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి. వస్తున్న వార్తలు ప్రకారం సుశాంత్ చనిపోయిన తరువాత ఎప్పుడైతే రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిందో, ఆరోజు రాత్రి పెద్ద పెద్ద సూట్ కేసులతో రియా ఇంటి నుంచి ఆమె ఫ్యామిలీ అదృశ్యమైనట్లు బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కేసును ఒకపక్క ముంబై పోలీసులు మరోపక్క బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణలో తవ్వేకొద్దీ కొత్త ట్విస్ట్ లతో పాటు 15 కోట్లు బదిలీ అవ్వటం, ఇప్పుడు సుశాంత్ సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ గా నెలకొంది. మొదట సుశాంత్ మేనేజర్ దిశా సాలిన్ సూసైడ్  … ఆ తర్వాత సుశాంత్ సూసైడ్ చేసుకోవడం, ఇప్పుడు రియా చక్రవర్తి పై 15 కోట్లు ఆరోపణలు వస్తున్న క్లిష్ట సమయంలో ఈ కేసును ముంబై పోలీసులకు అప్పగించాలని రియా పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.


Share

Related posts

Chiranjeevi Oxygen Banks: తెలుగు మీడియాకు చిరంజీవి సాయం కనిపించదా..? సోనూ మాత్రమేనా..?

Muraliak

Sushanth Sing : ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌.. సుశాంత్ కు అరుదైన గౌరవం..!!

sekhar

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం.. నేటి రేట్లు ఇలా..!!

bharani jella