Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.
తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది.
దీంతో ఇప్పుడు పవన్ మరియు రానా అభిమానులు భీమ్లా నాయక్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట. అక్కడే ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయానున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్‌గా, రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియర్ శేఖర్‌గా కనిపించబోతున్నారు. వీరిద్దరి సరసనా నీత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించబోతుండగా.. తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.